కందుకూరు ఆకుకూరల టేస్టే వేరు..ఎగబడి కొంటున్న వినియోగదారులు

x
Highlights

కండబలాన్ని గుండె నిబ్బరాన్ని పంట చేనుకు అంకితం ఇచ్చే రైతుకు నష్టాలు, కష్టాలు ఈ రోజుల్లో సర్వసాధరణమైపోయాయి ఎప్పుడైతే సంప్రదాయ సాగుని విస్మరించి...

కండబలాన్ని గుండె నిబ్బరాన్ని పంట చేనుకు అంకితం ఇచ్చే రైతుకు నష్టాలు, కష్టాలు ఈ రోజుల్లో సర్వసాధరణమైపోయాయి ఎప్పుడైతే సంప్రదాయ సాగుని విస్మరించి పురుగుమందుల వెంట పడ్డాడో అప్పుడే రైతన్న కు ఇబ్బందులు మొదలయ్యయి. పెట్టుబడి కొండంత కానీ వచ్చే దిగుబడి , రాబడి గోరంతే వీటన్నింటిని ఎదిరించి ఖమ్మం జిల్లాకు చెందిన రైతు సేంద్రియ పద్ధతులతో ఆకుకూరలు పండిస్తున్నాడు లాభాల బాటలో పయనిస్తున్న రైతు సుధాకర్ రెడ్డి.

పంట పొలంలో చెమటోడ్చి పండించిన పత్తి, మిరప ఆదుకోవాటం లేదు అయినా సరే రైతులందరూ పురుగు మందుల మోజులో పడి సంప్రదాయ పద్ధతులను విస్మరిస్తున్నారు. కానీ ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం కందుకూర్ గ్రామానికి చెందిన రైతు బండి సుధాకర్ రెడ్డి మాత్రం రసాయనాలను పక్కన పెట్టి పంటల సాగులో పూర్తి సేంద్రియ విధానాలను అవలంభిస్తున్నారు. తన పొలంలో ఆకుకూరలను పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

సుధాకర్ రెడ్డి తనకున్న పొలంలో ఆకుకూరలు సాగు చేద్దాం అని నిర్ణయించుకున్నాడు. కాని అందరు రైతుల మాదిరిగానే పురుగు మందులు వాడటం వల్ల నష్టాలు తప్పవన్న వాస్తవాన్ని గుర్తించాడు. ప్రత్యాన్మయ పద్ధతిలో సాగు చెయ్యాలనుకున్నాడు. సేంద్రియ సాగు విధానాన్ని ఎననుకున్నాడు. 2 ఎకరాల్లో కొత్తిమీర, తోటకూర, పుదీనా, గోంగూర, పాలకుర, మెంతుకూరతో పాటు పలు రకాల ఆకుకూరలు సాగుచేయ్యడం ప్రారంభించారు.

నలుగురు కులీలతో కలిపి సుధాకర్ రెడ్డి దంపతులు మొత్తం ఆరుగురు పొలంలో పనిచేస్తుంటారు. తోటలో తీసిన అకుకురాలను అక్కడే నీటిలో శుభ్రంగా కడిగి కట్టలు కడతారు. ఈ ఆకుకూరలను తను ప్రత్యకంగా తయారి చేసుకున్న ఆటో లో తీసుకెళ్ళి సమీపంలో ఉన్న గ్రామాలలో అమ్ముతుంటారు. ప్రతి రోజు 2 వేల రూపాయల అకుకురాలను ఉత్పత్తి చేస్తున్నారు. కూలీలు ఆటో ఖర్చులు పోను రోజుకి వెయ్యి వరకు ఆదాయం పొందుతున్నట్లు రైతు చెబుతున్నాడు.

మొదట రసాయనాల సాగులో నష్టాలను చవిచూసిన ఈ రైతు సేంద్రియ సాగుతో సత్ఫలితాలను పొందుతున్నారు పశువుల పేడను కంపోస్ట్ ఎరువుగా తాయారు చేసి మొదటగా దుక్కి దున్నేటప్పుడు ఎరువుగా వేశారు. తరువాత స్వల్పకాలిక కూరగాయలను సాగు చేశారు. చీడ పీడలు పంటకు ఆశించినప్పుడు వేపకషాయం, గో మూత్రం పిచికారి చేశారు. ఫలితంగా చీడ పీడలు నశించాయి. పంట ఏపుగా పెరిగింది. మంచి దిగుబడులు వచ్చాయి. ఇప్పుడు తనతో పాటు తోటివారికి ఉపాధిని కల్పిస్తున్నాడు ఈ రైతు.

రసాయనలు లేని ఆకు కూరలకు మంచి గిరాకి లభిస్తోంది. వేపపొడి, గో మూత్రం, వంటి సేంద్రియ ఎరువులు వాడి పండిస్తున్న పంట కాబట్టి గృహిణులు, వినియోగదారులు కందుకూర్ నుంచి వచ్చే ఆకూ కూరల ఆటో కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఆటో రాగానే జనం ఎగబడి ఆకుకూరలను కొంటున్నారు .

రసాయనాల ద్వారా ఆకుకూరలను పండిస్తే 20 రోజులకు దిగుబడి వస్తుంది కానీ సేంద్రియ పద్ధతి లో ఆకుకూరల దిగుబడి రావడానికి 40 రోజులు పడుతుంది. అందుకూ సేంద్రియ పద్ధతి లో సాగు చెయ్యాలంటే రైతుకు ఓపిక అవసరం అని అటాడు ఈ రైతు. కానీ రసాయనాలతో పండించే పంట కు ఎకరాకు 30 వేల వరకు పెట్టుబడి అవుతుంది. అదే సేంద్రియ పద్ధతి లో సాగు కేవలం 5 వేల పూర్తవుతుంది. అందుకే రైతులు సేంద్రియ సేద్యం వైపు అడుగులు వేయాలంటున్నాడు సుధాకర్‌. నాణ్యమైన పంట దిగుబడి కేవలం సేంద్రియ సాగు ద్వారానే సాద్యం అవతుందని నిరూపిస్తున్నాడు ఈ రైతు. అందుకే తోటి రైతలు సేంద్రియ పద్ధతిలో ఆకుకూరల సాగు చెయ్యటానికి ముందుకు వస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories