గోమాతపై ఓ కామాంధుడి లైంగికదాడి..

x
Highlights

కామాంధులు పశువులను సైతం వదలడం లేదు. భారతీయులు దేవతంగా పూజించే గోమాతపై ఓ కామ పిశాచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసిన...

కామాంధులు పశువులను సైతం వదలడం లేదు. భారతీయులు దేవతంగా పూజించే గోమాతపై ఓ కామ పిశాచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసిన ఘటనపై అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పశువుపై అఘాయిత్యం చోటు చేసుకుంది. ఓ కామపిశాచి గోవుపై పైశాచికానికి పాల్పడ్డాడు. పిఠాపురం మండలం గోకివాడ గ్రామంలో పశువులపాకలో కట్టిసిన ఆవుపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. గోవాడకు చెందిన నామ బుచ్చిరాజు మూడు ఆవులు, రెండు గిత్తలు, ఓ దూడను సాదుతున్నాడు. రోజు మాదిరిగానే పశువులపాక వద్దకు వచ్చిన బుచ్చిరాజుకు కట్టేసి ఉన్న ఆవు మాయం కావడంతో పరిసర ప్రాంతాల్లో వెతికి చూశాడు. సమీపంలోని ఓ తాటిచెట్టుకు కట్టేసి ఉన్న ఆవు కదల్లేని స్థితిలో పడి ఉండటాన్ని గమనించాడు. గోవుపై రక్తపు గాయలు కనిపించడంతో లైంగిక దాడి జరిగినట్లు అనుమానించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పశువుల కొట్టాన్ని సందర్శించిన పోలీసులు ఆవుకు పశువైద్యులచే చికిత్స చేయించారు. గోమాతపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు గుర్తించారు. మూగప్రాణాలను కూడా హింసిస్తూ ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్న కామాందులను గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories