Top
logo

కాజీపేటలో దారుణం.. అర్ధరాత్రి దంపతుల దారుణ హత్య

కాజీపేటలో దారుణం.. అర్ధరాత్రి దంపతుల దారుణ హత్య
X
Highlights

వరంగల్ జిల్లా కాజీపేటలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న దంపతులను గుర్తుతెలియని దుండగులు హత్య...

వరంగల్ జిల్లా కాజీపేటలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న దంపతులను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. కాజీపేట మండలం సోమిడి గ్రామంలో ఎల్లయ్య, పుల్లమ్మ అనే దంపతులు నివశిస్తున్నారు. అయితే... అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి ఎల్లయ్య, పుల్లమ్మలను ఇటుకలతో మోదీ చంపేశారు. ఉదయం ఇంట్లోంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కల వారు తలుపులు నెట్టిచూడగా విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి హత్యపై దర్యాప్తు చేస్తున్నారు.

Next Story