ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సోదాలు..

nanireddy
Updated on: 24 Dec 2018 3:54 PM IST
ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సోదాలు..
X

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ లో ప్రముఖ వ్యాపారవేత్త జీపీరెడ్డి ఇంట్లో అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే.. సోదాలు చేయడానికి వచ్చిన పోలీసులను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ప్రశ్నించారు. సోదాలు నిర్వహించడంపై వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాస్ ఆయనకు వివరణ ఇచ్చారు. ఓ కేసు విషయంలో విచారించేందుకు ఇంటికి వచ్చామని తెలిపారు.అయితే ఎలాంటి వారెంట్‌ లేకుండా.. పైగా ఆరోగ్యం బాగా లేదని చెప్పినా పోలీసులు సోదాలు చేపట్టడంపై లగడపాటి ఫైర్ అయ్యారు.

nanireddy

nanireddy

Next Story