మహాకూటమిలో పెరుగుతున్న నిరసనలు...ఉత్తమ్‌ ఇంటి ముట్టడికి...

x
Highlights

మహాకూటమిలో అప్పుడే నిరసన సెగలు జోరందుకున్నాయి. పొత్తుల్లో భాగంగా.. హైదరాబాద్‌ శేరిలింగంపల్లి అసెంబ్లీ టిక్కెట్‌ను టీడీపీకి కేటాయించారనే వార్తలతో.....

మహాకూటమిలో అప్పుడే నిరసన సెగలు జోరందుకున్నాయి. పొత్తుల్లో భాగంగా.. హైదరాబాద్‌ శేరిలింగంపల్లి అసెంబ్లీ టిక్కెట్‌ను టీడీపీకి కేటాయించారనే వార్తలతో.. స్థానిక కాంగ్రెస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్‌ ఆధ్వర్యంలో అనుచరులు, కార్యకర్తలు.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ఇంటిని ముట్టడించేందుకు సిద్ధమయ్యారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా కనిపిస్తోంది. దీంతో ఉత్తమ్‌ ఇంటి దగ్గర కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు అదే శేరిలింగంపల్లిలో టీడీపీ నాయకుడు భవ్య ఆనంద ప్రసాద్‌ ప్రచారం చేస్తుండగా ఆ పార్టీకి చెందిన మువ్వ సత్యనారాయణ వర్గం అడ్డుకుంది. నినాదాలు, నిరసనలతో ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి. ఇటు ఆనంద్‌ ప్రసాద్‌పై చెప్పులతో దాడికి దిగడంతో శేరిలింగంపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళన కారులను అడ్డుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories