logo
జాతీయం

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాం : రాహుల్‌గాంధీ

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాం : రాహుల్‌గాంధీ
X
Highlights

విభజన హామీలు నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఏపీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ ...

విభజన హామీలు నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఏపీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంఘీభావం తెలిపారు. పార్లమెంట్ స్ట్రీట్‌లో ఏపీ కాంగ్రెస్ నేతలు చేసిన నిరసన కార్యక్రమానికి రాహుల్ హాజరై వారికి మద్దతు తెలిపారు. ఏపీ డిమాండ్లపై రాహుల్ గాంధీ తొలి విడత పార్లమెంట్ సమావేశాల సమయంలో కూడా ట్వీట్ ద్వారా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధన అంశంలో ఆంధ్రులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ కేంద్రమంత్రి పల్లంరాజు సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story