మళ్లీ నోరుజారిన షా, ఈసారి

కర్ణాటకలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. అధికార- విపక్షాల మధ్య మాటల యుద్ధం కాసేపు పక్కనబెడితే.. తాజాగా...
కర్ణాటకలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. అధికార- విపక్షాల మధ్య మాటల యుద్ధం కాసేపు పక్కనబెడితే.. తాజాగా మరోసారి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ప్రశంసించేలా వ్యాఖ్యలు చేశారు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. సిల్క్ ఉత్పత్తిలో దేశంలోనే కర్ణాటక అగ్రస్థానంలో ఉందని కొనియాడారు. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక కాంగ్రెస్ ట్విటర్ వేదికగా ఆనందం వ్యక్తం చేసింది. ‘మరోసారి నిజాలు మాట్లాడిన అమిత్ షాకు కృతజ్ఞతలు. మీరు మా స్టార్ ప్రచారకర్తగా మారుతున్నారు. 2016-17 సంవత్సరంలో కర్ణాటకలో సిల్క్ ఉత్పత్తి ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది’ అని కర్ణాటక కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
ఇటీవల ఓ ప్రచార సభలో పాల్గొన్న అమిత్ షా తన ప్రసంగంలో పొరబడిన విషయం తెలిసిందే. సిద్ధరామయ్య ప్రభుత్వం అవినీతిమయం అని అనబోయి.. యడ్యూరప్ప ప్రభుత్వం అవినీతిమయం అన్నారు. దీంతో పక్కనే ఉన్న యడ్యూరప్ప కంగు తిన్నారు. ఆ తర్వాత మరో నేత సాయంతో తన పొరబాటును సరిదిద్దుకున్నారు. ఇది జరిగిన కొద్ది రోజులకే అమిత్ షా హిందీ ప్రసంగాన్ని కన్నడలోకి తర్జుమా చేసే సమయంలో పొరబాటు జరిగింది. హిందీలో షా అన్న వ్యాఖ్యలను మరో భాజపా నేత కన్నడలోకి అనువదిస్తూ.. ప్రధానమంత్రి దేశాన్ని నాశనం చేశారన్నారు.
Thank you Amit Shah for speaking the truth yet again. You are turning out to be our Star Campaigner!
— Karnataka Congress (@INCKarnataka) April 5, 2018
Karnataka's Silk production hit an all-time high in 2016-17. Major cocoon markets have been modernised & integrated with e-Mandi platform.#NavaKarnatakaNirmana pic.twitter.com/h8PdDVGdzQ
జనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMTSinkhole: భారీగా పెరుగుతున్న వింత గొయ్యి లోతు..
9 Aug 2022 3:00 PM GMTMLA Raja Singh: డేట్ రాసి పెట్టుకోండి.. వందశాతం నన్ను చంపేస్తారు..
9 Aug 2022 12:14 PM GMT
ఇవాళ గాంధీభవన్‌లో రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం
11 Aug 2022 1:46 AM GMTకేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం
11 Aug 2022 1:06 AM GMTనుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట
10 Aug 2022 4:00 PM GMTHealth Tips: ఇవి తింటే మీ పని అంతే.. ఎంత నష్టం జరుగుతుందంటే..?
10 Aug 2022 3:30 PM GMTమోహన్ బాబుని ట్రోల్ చేస్తున్న సాయిబాబా భక్తులు
10 Aug 2022 3:15 PM GMT