70 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా

x
Highlights

ముందస్తు రేసులో టీఆర్ఎస్‌‌కు పోటీగా పరుగులు పెడుతున్న టీ.కాంగ్రెస్ గ్రౌండ్ వర్క్ వేగవంతం చేసింది. ఇప్పటికే మేనిఫెస్టోను ప్రకటించిన టీపీసీసీ ఎమ్మెల్యే...

ముందస్తు రేసులో టీఆర్ఎస్‌‌కు పోటీగా పరుగులు పెడుతున్న టీ.కాంగ్రెస్ గ్రౌండ్ వర్క్ వేగవంతం చేసింది. ఇప్పటికే మేనిఫెస్టోను ప్రకటించిన టీపీసీసీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రాహుల్ ఆమోదముద్ర పడగానే శాసన సభ అభ్యర్థుల లిస్టు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

అందరికంటే ఒక అడుగు ముందుకేసి మేనిఫెస్టోను ప్రకటించిన టీపీసీసీ ఇప్పుడు అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. నిన్న కాంగ్రెస్‌ వార్‌రూమ్‌లో జరిగిన పీసీసీ అధ్యక్షుల సమావేశానికి వెళ్లిన ఉత్తమ్ ఆ తర్వాత పార్టీ అగ్ర నేతల్ని కలిశారు. ఈ ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు ఖాయం కావడంతో ముందస్తు వ్యూహాలపై వారితో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఎన్నికల కమిటీలు, అభ్యర్థుల అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. ఎన్నికల ప్రచారం, బహిరంగ సభల అంశంపై కూడా చర్చ జరిగింది. తెలంగాణ ఇచ్చి కూడా అధికారంలోకి రాలేకపోయామనే భావనతో ఉన్న హైకమండ్ పెద్దలు ఉత్తమ్‌కు విజయ సూత్రాలను వల్లెవేశారు.

టీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పార్టీ కూడా శాసన సభ అభ్యర్థుల జాబితా రెడీ చేసినట్లు తెలుస్తోంది. సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే తొలి విడతగా 70 మంది పేర్లను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మానస సరోవర్ యాత్రలో ఉన్న పార్టీ అధ్యక్షుడు రాహుల్ తిరిగి రాగానే ఆ జాబితాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇదే విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా స్పష్టం చేశారు. టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా రెడీగా ఉందన్న కుంతియా జాతీయ పార్టీలో జరిగే ప్రక్రియ వల్ల ప్రకటన కాస్త ఆలస్యమవుతోందని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయమని ఢంకా భజాయించారు.

అలాగే పొత్తుల గురించి కూడా టీ కాంగ్రెస్ దృష్టి సారించినట్లు సమాచారం. నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో వెంటనే పొత్తుల సంగతి తేల్చేయాలని భావిస్తున్నారు. సమయం తక్కువగా ఉండడంతో పొత్తుల విషయంలో త్వరపడాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories