చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

nanireddy
Updated on: 24 Dec 2018 4:45 PM IST
చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
X

తెలంగాణ రాష్ట్రం 'ఇళ్ళెందు' శాసనసభ్యురాలు బానోతు హరిప్రియ ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. శుక్రవారం ఉండవల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన హరిప్రియ తన గెలుపునకు సహకరించినందకు కృతజ్ఞతలు తెలిసిజేశారు. ఆమె వెంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని), తన భర్త హరిసింగ్‌నాయక్‌, ఏఐసీసీ గిరిజన విభాగం సమన్వయకర్త చౌహన్‌ లు ఉన్నారు. తన రాజకీయ రంగ ప్రవేశం టీడీపీ నుంచే జరిగిందని, చంద్రబాబు కృషి మరిచిపోలేనంటూ ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇల్లెందు నియోజకవర్గంలో తన విజయం కోసం తీవ్రంగా కృషి చేశారని హరిప్రియ చంద్రబాబుకు వివరించారు. కాగా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మహకూటమి పక్షంగా కాంగ్రెస్ కు చెందిన హరిప్రియకు ఇళ్ళెందు టికెట్ దక్కింది. ఆమె తన సమీప ప్రత్యర్థి అయిన తెరాస అభ్యర్థిపై గెలుపొందారు.

nanireddy

nanireddy

Next Story