‘నోటా’ సినిమాపై కాంగ్రెస్ నేతల షాకింగ్ కామెంట్స్

‘నోటా’ సినిమాపై కాంగ్రెస్ నేతల షాకింగ్ కామెంట్స్
x
Highlights

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘నోటా’ సినిమాపై కాంగ్రెస్ నేతలు షాకింగ్ కామెంట్స్ చేశారు. నోటా సినిమాను నిలిపివేయాలని టీపీసీసీ కోశాధికారి గూడూరు...

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘నోటా’ సినిమాపై కాంగ్రెస్ నేతలు షాకింగ్ కామెంట్స్ చేశారు. నోటా సినిమాను నిలిపివేయాలని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి డిమాండ్‌ చేశారు. నోటా సినిమా ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. యువతపై ప్రభావం చూపుతుందని తాము భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఇది ఎన్నికల కోడ్‌కు విరుద్ధమని అన్నారు. నోటా ట్రైలర్‌ ఓటర్‌ను ప్రభావితం చేసేలా ఉందన్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి. ఎన్నికల సంఘం నోటా ప్రివ్యూ చూసిన తర్వాతనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన జరగకుండా ఈసీ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories