కేసీఆర్ ఫ్రంట్ కు గండి కొడుతున్న కాంగ్రెస్

కేసీఆర్ ఫ్రంట్ కు గండి కొడుతున్న కాంగ్రెస్
x
Highlights

‘కాంగ్రెస్, బీజేపీ దేశ ప్రజలను మోసం చేశాయి.. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పును తీసుకొస్తా.. కాలం కలిసొస్తే థర్డ్ ఫ్రంట్ కు నాయకత్వం వహిస్తా.....

‘కాంగ్రెస్, బీజేపీ దేశ ప్రజలను మోసం చేశాయి.. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పును తీసుకొస్తా.. కాలం కలిసొస్తే థర్డ్ ఫ్రంట్ కు నాయకత్వం వహిస్తా.. అద్భుతాలు చేసి చూపిస్తా’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలకు.. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం గండి కొట్టడం మొదలు పెట్టింది. ఉత్తరప్రదేశ్ లో ఉప ఎన్నికల ఫలితాలనే ఇందుకు భూమికగా కాంగ్రెస్ వాడుకుంటోంది.

బీజేపీకి వ్యతిరేకంగా బలమైన మహాకూటమిని కూడగట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్.. దేశ వ్యాప్తంగా ఉన్న ఇతర పార్టీలను కూడా కలుపుకొని పోయేందుకు రంగం సిద్ధం చేసింది. యూపీలో అలా ఉప ఎన్నికల ఫలితాలు రాగానే.. ఇలా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్.. ఒక్కో పార్టీతో సమావేశాలు మొదలు పెట్టేశారు. కాంగ్రెస్ నాయకత్వంలో పని చేసేలా ఒప్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో చర్చలు చేశారు.

త్వరలో మరిన్ని పార్టీలతోనూ భేటీ కాబోతున్నారు. అటు.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా 17 పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇలా.. కాంగ్రెస్ కు గత వైభవం తీసుకురావడం.. బీజేపీకి వ్యతిరేకంగా బలమైన కూటమిని ఏర్పాటు చేయడం.. థర్డ్ ఫ్రంట్ వైపు ఇతర పార్టీలు వెళ్లకుండా చేయడమే.. ఈ చర్యల లక్ష్యంగా కనిపిస్తోంది. దీనిపై.. కేసీఆర్ స్పందన ఎలా ఉండబోతోంది? థర్డ్ ఫ్రంట్ పై ఆయన అడుగులు ఫలితాన్ని ఇస్తాయా? కాంగ్రెస్ ఎత్తుల ముందు.. థర్డ్ ఫ్రంట్ అన్న పాచిక పారే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories