కాంగ్రెస్, టీడీపీ కలయిక ఎఫెక్ట్.. కీలకనేత రాజీనామా..

nanireddy
Updated on: 24 Dec 2018 3:45 PM IST
కాంగ్రెస్, టీడీపీ కలయిక ఎఫెక్ట్.. కీలకనేత రాజీనామా..
X

కాంగ్రెస్, టీడీపీ ల కలయికను కొంతమంది కాంగ్రెస్ నేతలు అంగీకరించడంలేదు. నిన్న(గురువారం) ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు మాజీ మంత్రి వట్టి వసంత కుమార్. 1983 నుంచి పోరాడుతున్న టీడీపీతో కాంగ్రెస్ కలవడం దారుణమని అన్నారు వట్టి. ఈ కలయికను ఎవరు జీర్ణించుకోలేరని.. ఇకపై తాను కాంగ్రెస్ లో ఉండబోనని స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా ఉన్నారు వట్టి వసంత కుమార్. రెండు రోజుల్లో తన భవిశ్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పాడు.

nanireddy

nanireddy

Next Story