కాంగ్రెస్ కు సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

nanireddy
Updated on: 24 Dec 2018 4:03 PM IST
కాంగ్రెస్ కు సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి రాజీనామా
X

రాజేంద్రనగర్ టికెట్ తనకు కాకుండా టీడీపీకి కేటాయించారన్న కారణంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి. మొదటినుంచి రాజేంద్రనగర్ టికెట్ తనకే వస్తుందని అనుకున్నాను. తీరా నామినేషన్ల సమయానికి ఆ సీటును
టీడీపీకి ఇచ్చారని.. దాంతో తమ కార్యకర్తలు మనస్థాపం చెందారని కార్తీక్ రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, డివిజన్‌ అధ్యక్షులు రాజీనామా చేస్తారని హెచ్చరించారు. మహాకూటమి పేరుతో టీడీపీ నేత ఎల్. రమణ టిక్కెట్లు అమ్ముకున్నారని మండిపడ్డారు. రాజేంద్రనగర్‌లో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయన్న కార్తీక్.. కాంగ్రెస్‌ అభ్యర్థి అయితేనే గెలుస్తారని వ్యాఖ్యానించారు.

nanireddy

nanireddy

Next Story