కేసీఆర్‌కు జానారెడ్డి సవాల్...ఆధారాలతో నిరూపిస్తే రాజకీయ సన్యాసం...

కేసీఆర్‌కు జానారెడ్డి సవాల్...ఆధారాలతో నిరూపిస్తే రాజకీయ సన్యాసం...
x
Highlights

టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్‌ సినీయర్‌ నేత జానారెడ్డి ఫైరయ్యారు. రైతులకు 24గంటలు ఉచిత కరెంట్‌ ఇస్తే గులాబీ జెండా పట్టుకుంటానని తాను...

టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్‌ సినీయర్‌ నేత జానారెడ్డి ఫైరయ్యారు. రైతులకు 24గంటలు ఉచిత కరెంట్‌ ఇస్తే గులాబీ జెండా పట్టుకుంటానని తాను చెప్పలేదని, కావాలంటే రికార్డులు పరిశీలించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తెలిపారు. తాను టీఆర్‌ఎస్‌ జెండా పట్టుకుంటానని ఎప్పుడు చెప్పలేదని స్పష్టం చేశారు. నిజంగా ఆధారాలతో నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి అబద్దాలు ఎలా చెబుతారని నిలదీశారు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్న కేసీఆర్‌ ఆత్మ విమర్శన చేసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. నిన్నటి హుస్సాబాద్ సభలో జానారెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తే గులాబీ కండువా కప్పుకుని, టీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తానన్న జానారెడ్డికి 24 గంటల కరెంట్ కనిపించడం లేదా అని ప్రశ్నించిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories