సికింద్రాబాద్‌ నుంచే పోటీ చేస్తున్నా: అంజన్‌కుమార్

సికింద్రాబాద్‌ నుంచే పోటీ చేస్తున్నా: అంజన్‌కుమార్
x
Highlights

తానుండగా సికింద్రాబాద్‌ నుంచి మరెవరూ పోటీచేయరని.. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తేల్చిచెప్పారు. రాహుల్ గాంధీ ఆదేశాలతో తానే చేయి గుర్తుపై సికింద్రాబాద్...

తానుండగా సికింద్రాబాద్‌ నుంచి మరెవరూ పోటీచేయరని.. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తేల్చిచెప్పారు. రాహుల్ గాంధీ ఆదేశాలతో తానే చేయి గుర్తుపై సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అజారుద్దీన్ వెనుక రాష్ట్ర క్యాడర్‌కు చెందిన వ్యక్తులున్నారని ఆరోపిస్తున్నారు అంజన్ కుమార్ యాదవ్‌. సోమవారం ఇందిరా భవన్‌లో జరిగిన నగర కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో ఈ రోజు రసాభాస చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అంజన్‌ కుమార్‌ యాదవ్‌ ‘హెచ్‌ఎంటీవీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సికింద్రాబాద్‌ నుంచి తానే పోటీచేస్తానని స్పష్టంచేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ సీటు ఇంకెవరికైనా ఇస్తామని ప్రకటించలేదు కదా అన్నారు. అజారుద్దీన్‌ సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేస్తాననని ఆయనే చెప్పుకుంటున్నారన్నారు. గతంలో కూడా ఆయన దేశంలోని పలు చోట్లనుంచి పోటీచేస్తానని చెప్పుకున్న సంగతిని ఈ సందర్భంగా అంజన్‌ గుర్తుచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories