కాంగ్రెస్‌కు అమావాస్య సెంటిమెంట్‌

కాంగ్రెస్‌కు అమావాస్య సెంటిమెంట్‌
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్ అమావాస్య సెంటిమెంటుతో భయపడుతుందా.....? అందుకే పార్టీ అభ్యర్దుల లిస్టును అమావాస్య తర్వాత విడుదల చేయడానికి సిద్దమవుతుందా.....?...

తెలంగాణ కాంగ్రెస్ అమావాస్య సెంటిమెంటుతో భయపడుతుందా.....? అందుకే పార్టీ అభ్యర్దుల లిస్టును అమావాస్య తర్వాత విడుదల చేయడానికి సిద్దమవుతుందా.....? ఇన్నిరోజులు ఏవి పట్టించుకోని కాంగ్రెస్ ఎందుకు సెంటిమెంటులకు పెద్దపీఠ వేస్తోంది.....? అభ్యర్దలు ప్రకటన సీట్ల సర్దుబాటు కోసమా....? లేక సెంటుమెంటు కోసమా.....? ఇది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణ .కాంగ్రెస్ ఎన్నడూ లేని విధంగా అభ్యర్దుల విషయం నాన్చుతూ వస్తోంది. నవంబర్ 2న కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులను ప్రకటిస్తుందని అందరూ భావించారు. గురువారం ఢిల్లిలో మాకాం వేసిన కాంగ్రెస్ నేతలంత అధినేత్రి సోనియాగాంధితో భేటి అయ్యారు. గురువారం అష్టమి కావడంతో అభ్యర్దుల ప్రకటన గురువారం ఉంటుందని అందరూ భావించారు. కానీ ఢిల్లిలో కోర్ మీటింగ్ తరువాత అభ్యర్దుల ప్రనకటన నవంబర్ 8న చేయనున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు.

నవంబర్ 7న దీపావళీ పండుగ అదే రోజు అమావాస్య కావడంతో తెలంగాణ .కాంగ్రెస్ నేతలు అమవాస్య తరువాత రోజు అయితే మంచి రోజు అని భావించి ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అమావాస్య రోజుల్లో అభ్యర్దులను ప్రకటిస్తే మంచి జరగదని కాంగ్రెస్ భయపడుతుందనే చర్చ గాంధిభవన్‌లో జరుగుతోంది. ఇన్ని రోజులు ముఖ్యమంత్రి కేసిఆర్ మాత్రమే మంచి రోజులు కోసం చూస్తారని అందరూ భావించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సైతం మంచి రోజులు కోసం చూస్తున్నట్లు స్పష్టమౌతోంది.

నేటికి పొత్తుల్లో సీట్లు సర్దుబాటు అంశం కూడ కొలిక్కి రాలేదు. అన్ని పార్టీలు సీట్ల పంపంకాల్లో ఏకాభిప్రాయం కుదరనందునా అమావాస్య తరువాత రోజు నాటికి అన్ని సమస్యలు పరిష్కరించుకొని అభ్యర్దుల లిస్టు ఎనిమిదో తేదినాటికి పూర్తి అవుతందనే చర్చ కూడ పార్టీలో ఉంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళుతుంటే కాంగ్రెస్ మాత్రం మంచి రోజులు సీట్ల సర్దుబాటు పేరుతో ఆలస్యం చేస్తుందనే భావనలో పార్టీ నేతలు ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories