ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే టీఆర్ఎస్ గెలిచింది: సంపత్

Chandram
Updated on: 28 Dec 2018 12:17 PM IST
ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే టీఆర్ఎస్ గెలిచింది: సంపత్
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరులో టీఆర్ఎస్ ఆఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాడి నేటికి 15రోజులైనా ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణే లేదని, కనీసం ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం కూడా చేయించలేదని సంపత్ కుమార్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిందని ఆరోపించారు. ఇది తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుకాదని ఈవీఎం తీర్పేనని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో పాలనను గాలికివదిలేసి ఢిల్లీలో ఏదో ఫ్రంట్ అంటూ కేసీఆర్ తిరుగుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కనపెట్టి కెసిఆర్ గుళ్లు, గోపురాలంటూ తిరుగుతున్నారని మండిపడ్డారు. ఇక కేటీఆర్ దుబాయ్‌లో విలాసాలు గడుపుతున్నారని ధ్వజమెత్తారు.

Chandram

Chandram

Next Story