టీఆర్ఎస్‌‌లో చేరిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే

nanireddy
Updated on: 24 Dec 2018 4:04 PM IST
టీఆర్ఎస్‌‌లో చేరిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్‌ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. మంచిర్యాలకు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. తెరాస అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. మంచిర్యాల పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ అరవింద్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. అరవింద్ మాత్రమే కాదని, చాలా మంది కాంగ్రెస్‌ నేతలు టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతుండగా.. మరికొద్ది రోజుల్లో ఆ పార్టీకి చెందిన ఎంపీలు తమ పార్టీలో చేరబోతున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

nanireddy

nanireddy

Next Story