Top
logo

మహాకూటమిలో జనసమితి సీట్లు ఖరారు

X
Highlights

మహాకూటమి పొత్తులపై కాంగ్రెస్ అగ్రనేతలు దృష్టి సారించారు. మిత్ర పక్షాలకు కేటాయించే సీట్లపై నిర్ధారణకు వచ్చిన...

మహాకూటమి పొత్తులపై కాంగ్రెస్ అగ్రనేతలు దృష్టి సారించారు. మిత్ర పక్షాలకు కేటాయించే సీట్లపై నిర్ధారణకు వచ్చిన నేతలు ఏయే స్ధానాల్లో ఎవరెవరు పోటీ చేయాలనే దానిపై కార్లిటీ ఇచ్చారు. ఇందులో భాగంగానే కోదండరామ్ నేతృత్వంలోని టీజేఎస్‌కు 11 స్ధానాలు కేటాయించినట్టు సమాచారం. మెదక్, దుబ్బాక, మల్కాజ్ గిరి, వరంగల్ ఈస్ట్, సిద్దిపేట, చాంద్రాయణగుట్ట, మిర్యాలగూడ, రామగుండం, వర్దన్నపేట, అసిఫాబాద్, చెన్నూర్ స్థానాలను కేటాయించేందుకు సుముఖత తెలిపినట్లు సమాచారం. అయితే 15 స్ధానాలు కోరుతున్న టీజేఎస్‌ తమకు ప్రతిపాదించిన సగానికి పైగా స్ధానాలను మార్పు చేయాలని కోరుతోంది. కాంగ్రెస్ జాబితాలో మార్పుచేర్పులపై జనసమితి నేతలు చర్చలు జరుపుతున్నారు.

Next Story