అర్చకస్వాముల మధ్య ఏంటీ అంతరం!!

x
Highlights

ఇద్దరు అర్చక స్వాముల మధ్య తలెత్తిన వృత్తిపరమైన విబేధాలు కుట్రలకు దారితీసాయి. ఒక అర్చకుడిని అత్యాచారం కేసులో ఇరికించేందుకు మరో అర్చకుడు చేసిన ప్రయత్నిం...

ఇద్దరు అర్చక స్వాముల మధ్య తలెత్తిన వృత్తిపరమైన విబేధాలు కుట్రలకు దారితీసాయి. ఒక అర్చకుడిని అత్యాచారం కేసులో ఇరికించేందుకు మరో అర్చకుడు చేసిన ప్రయత్నిం బెడిసికొట్టింది. పరమ పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో జరిగిన ఈ వ్యవహారం ఎట్టకేలకు తిరుమల పోలీసులు బట్టబయలు చేశారు. తిరుమలలోని వరాహస్వామి ఆలయంలో సంభావన అర్చకులుగా విధులు నిర్వహించే మణికంఠ, మారుతి ప్రసాద్ అనే ఇద్ధరు అర్చకుల మధ్య వృత్తి రీత్యా గత కొంత కాలంగా విబేధాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో మారుతిప్రసాద్‌కు శ్రీవారి సేవకు వచ్చిన కడపకు చెంధిన కవిత అనే మహిళతో పరిచయం ఏర్పడింధి. కవిత సహాయంతో మణికంఠ ను ఎలాగైనా అభాసుపాలు చేయాలని నిర్ణయించిన మారుతి కుట్ర పన్నాడు.

కడపకు చెందిన సరోజమ్మ, కల్యాణి అనే ఇద్ధరు మహిళలను రంగంలో దించాడు. వారిని మణికంఠ అత్యాచారం చేసేంధుకు ప్రయత్నిచినట్లుగా నెపం మోపి ఎలాగైనా అతనిని అభాసుపాలు చేయాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో తిరుమల చేరుకున్న ఆ ఇద్ధరు మహిళలు మారుతీ ప్రసాద్ ప్లాన్‌ను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. మణికంఠ బసచేసిన అర్చక నిలయంలో ప్రవేశించి డ్రామాలకు తెరతీసారు. గదిలోకి ప్రవేశించి ఒక్కసారిగా అతనిపై ధాడికి ధిగడంతో మణికంఠ విస్మయానికి గురయ్యాడు. తోటి సిబ్బంది సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు.


మహిళలను అదుపులోకి తీసుకొన్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ దాడికి ప్రధాన సూత్రధారి తోటి అర్చకుడు మారుతి ప్రసాదే అని పోలీసులు తేల్చారు. వీరితో పాటు మధు, శివ, గిరి అనే వ్యక్తుల పాత్ర ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెబుతున్నారు. తిరుమలలోని వరాహస్వామి ఆలయంలో ఇద్దరు అర్చక స్వాముల మధ్య తలెత్తిన వృత్తిపరమైన విబేధాలు ఇద్దరి పరువును మంటగలిపాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories