విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం

విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం
x
Highlights

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖలో ప్రారంభమైంది. భాగస్వామ్య సదస్సుకు ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి...

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖలో ప్రారంభమైంది. భాగస్వామ్య సదస్సుకు ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. 40 దేశాలకు చెందిన 2వేల మంది ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సదస్సులో 11 అంశాలపై ప్లీనరీ సెషన్లు నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. ఇప్పటికే 400 అవగాహన ఒప్పందాలకు ప్రతిపాదనలు వచ్చాయి. ఈ నెల 26న భాగస్వామ్య సదస్సు ముగింపు కార్యక్రమం జరగనుంది. ప్రారంభ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు అశోక్‌గజపతిరాజు, సురేష్‌ ప్రభు, పలువురు ప్రముఖ పారిశ్రామిక దిగ్గజ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories