ఆపరేషన్ గరుడపై విచారణ జరిపించండి : వ్యక్తి ఫిర్యాదు
వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేయాలని.. అలాగే ఆపరేషన్ గరుడ గురించి విచారణ జరపాల్సిందిగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి బుర్రగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆపరేషన్ గరుడలో భాగంగానే జగన్ పై ఈ దాడి జరిగిందని సినీ నటుడు శివాజీ చెప్పినట్టు అయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై డీజీపీ సానుకూలంగా స్పందించారని, విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చినట్టు బుర్రగడ్డ అనిల్ తెలిపారు.
Next Story




