రేవంత్‌రెడ్డిపై ఐటీ దాడుల్లో కొత్త కోణం

రేవంత్‌రెడ్డిపై ఐటీ దాడుల్లో కొత్త కోణం
x
Highlights

రేవంత్‌రెడ్డిపై ఐటీ దాడుల్లో కొత్త కోణం వెలుగు చూసింది. జూన్‌ 27వ తేదిన రామారావు అనే న్యాయవాది రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో భాగంగానే ఐటీ...

రేవంత్‌రెడ్డిపై ఐటీ దాడుల్లో కొత్త కోణం వెలుగు చూసింది. జూన్‌ 27వ తేదిన రామారావు అనే న్యాయవాది రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో భాగంగానే ఐటీ దాడులు జరుగుతున్నట్టు సమాచారం. మనీల్యాండరింగ్ ద్వారా మూడు వందల కోట్ల నగదు దారి మళ్లించారంటూ రామారావు గతంలో సీబీఐకి ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న సంస్ధలకు నగదు మళ్లించినట్టు ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. నగదు మళ్లిన సంస్దలు రేవంత్ కంపెనీల చిరునామాలతో ఉన్నట్టు ఫిర్యాదులో రామారావు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీబీఐ విచారణ జరపాలంటూ ఈడీ,ఐటీలను ఆదేశించింది. ఈ నేపధ్యంలోనే ఐటీ దాడులు జరుగుతున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories