ఎన్నికల బరిలో సినీనటుడు వేణుమాధవ్?

nanireddy
Updated on: 24 Dec 2018 4:03 PM IST
ఎన్నికల బరిలో సినీనటుడు వేణుమాధవ్?
X

సినీ నటుడు వేణుమాధవ్ ఎన్నికల బరిలో నిలుస్తున్నారట. నల్గొండ జిల్లా కోదాడ నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నారని సమాచారం. ఈ విషయాన్నీ పలువురికి ఫోన్‌ద్వారా సమాచారం చెప్పినట్టు తెలుస్తోంది. కాగా వేణుమాధవ్‌ స్వస్థలం కోదాడ పట్టణం. ఇక్కడే ఆయన విద్యాభ్యాసం పూర్తి చేసి అనంతరం హైదరాబాద్ లో మిమిక్రి ఆర్టిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలకు తన వంతు సేవాకార్యక్రమాలను చేపట్టేందుకు క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన తెలిపారు.

nanireddy

nanireddy

Next Story