బాంబు పేల్చిన కలెక్టర్ ఆమ్రపాలి

బాంబు పేల్చిన కలెక్టర్ ఆమ్రపాలి
x
Highlights

ఆమ్రపాలి.. వరంగల్‌ అర్బన్ జిల్లా కలెక్టర్. ఆమె ఏం మాట్లాడినా.. ఏం చేసినా.. టాక్ ఆఫ్‌ ద టౌన్‌. అందమే కాదు.. అద్భుతమైన పనితీరు ఆమె సొంతం. పారిశుద్ద్య...

ఆమ్రపాలి.. వరంగల్‌ అర్బన్ జిల్లా కలెక్టర్. ఆమె ఏం మాట్లాడినా.. ఏం చేసినా.. టాక్ ఆఫ్‌ ద టౌన్‌. అందమే కాదు.. అద్భుతమైన పనితీరు ఆమె సొంతం. పారిశుద్ద్య కార్మికులకు సినిమా టిక్కెట్లు బుక్‌ చేసినా.. కొండలపై ట్రెక్కింగ్ చేసినా.. అందరినీ ఆశ్చర్యపర్చింది. అలాంటి ఆమ్రపాలి.. ఓ బాంబ్ పేల్చారు.

కాకతీయుల చరిత్రకు సజీవసాక్ష్యంగా నిలుస్తున్న ఓరుగల్లులో కలెక్టర్‌ బంగ్లా ఇది. చెట్లు, చేమలతో చుట్టూ పచ్చదనంతో కళకళలాడుతున్న ఈ బిల్డింగ్‌ చూసేందుకు ఆహ్లాదకరంగా సుందరంగా కనిపిస్తుంది. పగటిపూట చూడ్డానికి అదిరిపోయే లొకేషన్‌లా కనిపిస్తుంది. కానీ చీకట్లు కమ్ముకున్నాయంటే చాలు ఇక్కడికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అటువైపు చూడాలంటేనే వణికిపోతున్నారు. ఎందుకంటారా ఈ బిల్డింగ్‌లో దెయ్యం ఉందట. ఈ విషయం ఎవరో అనామకులు చెప్పలేదు. సాక్ష్యాత్తు ఆ బంగ్లాలో ఉండే కలెక్టరే. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి ఉంటున్న ఈ బిల్డింగ్ ఫస్ట్‌ ఫ్లోర్‌లో దెయ్యం ఉందట.

వందేళ్ల చరిత్రను సొంతం చేసుకున్న బంగ్లా అది. కాకతీయుల చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్న ఇలాంటి బిల్డింగ్‌లో దెయ్యం ఉండటమేంటి..? ఉంటే ఆ దెయ్యం ఎవరై ఉంటారు..? అసలు దెయ్యాలున్నాయా..? దెయ్యాలున్నట్లు ఏకంగా కలెక్టర్లే నమ్ముతుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? అసలు ఆమ్రపాలి దెయ్యాన్ని నమ్ముతారా..? ఆ మొదటి అంతస్థు రహస్యమేంటి..?

దెయ్యం ఉందా లేదా..? వందల యేళ్ల నుంచి సమాధానం కోసం వెతుకుతున్న ప్రశ్న ఇది. కొందరు ఉందంటారు. మరికొందరు లేదంటారు. ఇంకొందరైతే దేవుడుంటే దెయ్యం ఉన్నట్లే అని కొత్త వాదనను తీసుకొస్తారు. ఎవరి నమ్మకం వారిది. ఎవరి విశ్వాసం వారిది. అయితే సమాధానమే లేని ఈ ప్రశ్నపై బోలెడు సినిమాలు వచ్చాయి. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి తీసిన సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల వర్షం కూడా కురిపించాయి.

అయితే దెయ్యాన్ని నమ్మనని చెబుతూనే ఓ రకమైన భయం ఉందని చెప్పుకొస్తున్నారు కలెక్టర్ ఆమ్రపాలి. 133 యేళ్ల క్రితం సూపర్‌ ఇంటెండెంట్‌ ఇంజనీర్‌గా జార్జ్‌ పామర్‌ ఉన్న సమయంలో ఆయన భార్య ఈ భవనానికి శంకుస్థాపన చేశారట. అయితే, ఈ మధ్య కొత్త కలెక్టరేట్‌‌కు పునాది రాయి వేసే సమయంలో ఆ భవనం చరిత్ర తెలుసుకున్నానని కలెక్టర్‌ అమ్రపాలి చెబుతున్నారు.

వందేళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఈ భవనం కేంద్రంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయని ఆసమయంలో ఇక్కడెవరైనా మరణించి ఉంటారని వారే దెయ్యమై పట్టి పీడిస్తున్నారని స్థానికులు కథనాలుగా చెప్పుకుంటారు. ఇదిలా ఉంటే దెయ్యాలు గియ్యాలంటూ ఏవీ లేవని వాటిని శాస్త్రీయ పరంగా రుజువు చేసింది ఇప్పటివరకు లేదని జనవిజ్ఞాన వేదిక చెబుతోంది. అయితే అలాంటి తప్పుడు కాన్సెప్ట్‌తో సినిమాలు తీసి ప్రజల్లో ఒకరకమైన భయాన్ని కలిగిస్తున్నారని అందుకే వాటినింకా విశ్వసిస్తున్నారని జనవిజ్ఞాన వేదిక నేతలు చెబుతున్నారు. కానీ ఎట్టకేలకు దైర్యం చేసి మొదటి అంతస్థుకు వెళ్లానన్న ఆమ్రాపాలి చిందరవందరగా ఉన్న వస్తువులను సర్దినట్లు చెప్పుకొచ్చారు. కానీ ఆ అంతస్థులో మాత్రం పడుకునేందుకు సాహసించలేదని.. ఆమ్రపాలి.. వినమ్రంగా చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories