తొమ్మిది పుంజులపై కేసు..

x
Highlights

మనుషులు చేసిన తప్పులకు... పుంజులు శిక్ష అనుభవిస్తున్నాయా ? స్వేచ్ఛగా ఉండాల్సిన కోడిపుంజులు స్టేషన్‌లో ఎందుకున్నాయ్ ? జీడిపప్పు, బాదంపప్పు తిన్న...

మనుషులు చేసిన తప్పులకు... పుంజులు శిక్ష అనుభవిస్తున్నాయా ? స్వేచ్ఛగా ఉండాల్సిన కోడిపుంజులు స్టేషన్‌లో ఎందుకున్నాయ్ ? జీడిపప్పు, బాదంపప్పు తిన్న కోళ్లకు... ఫుడ్డే కరువయింది. పందెంరాయుళ్లు వ్యక్తిగత పూచికత్తుపై విడుదలయ్యారు ? మరీ కోడిపుంజులు ఏం నేరం చేశాయ్. పందెంరాయుళ్లు నేరం చేస్తే.... పుంజులెందుకు శిక్షలు ఎందుకు అనుభవిస్తున్నాయ్.

ఈ కోళ్లను చూశారా ? వీటిని పందెంరాయుళ్లు కట్టేశారని భావిస్తే మీరు తప్పులో కాలేసినట్లే. ఈ కోడిపుంజులు ఉన్నది పోలీస్ స్టేషన్‌లో. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది పందెం పుంజులు. సంక్రాంతి పండగ సందర్భంగా స్టేషన్‌కు వచ్చిన కోడిపుంజులు రెండువారాలుగా నాలుగు గొడల మధ్యే బందీలుగా ఉన్నాయ్. సంక్రాంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం స్టేషన్‌ పరిధిలో కోడిపందేల పోలీసులు దాడులు నిర్వహించారు. 8 మంది పందెంరాయుళ్లను అరెస్టు చేసి 9 కోడిపుంజులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్‌లో పెట్టకముందు ఈ కోడి పుంజులు మహారాజుల్లా బతికాయి. జీడిపప్పు, బాదంపప్పు లాగించాయ్. తమకు ఇష్టం వచ్చినట్లు ఫుడ్ తిన్నాయ్.

పందెంరాయుళ్లతో పాటు కోడిపుంజులను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. వ్యక్తిగత పూచికత్తుతో 8మంది పందెంరాయుళ్లు విడుదలయ్యారు. సంక్రాంతి సందర్భంగా పట్టుకున్న పందెం పుంజులను ఒకేసారి ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో పట్టుబడ్డ కోడిపుంజులకు కష్టాలు మొదలయ్యాయ్. జడ్జ్‌ ఆదేశాలతో కోడిపుంజులను అచ్యుతాపురం పోలీసులు మళ్లీ స్టేషన్‌కు తీసుకొచ్చి లాకప్‌లో వేశారు. లాకప్‌లో మనుషుల్లా స్వేచ్ఛగా వదిలిపెట్టలేదు. లాకప్‌లోనూ వాటిని తాళ్లతో కట్టేశారు. పందెంలో గెలుపు కోసం పందెంరాయుళ్లు మంచి ఆహారం అందించి పెంచితే...ప్రస్తుతం పుంజులకు మంచి ఫుడ్‌ సంగతి అటుంచితే...కనీసం ఆహారం దొరకడమే గగనమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories