చింతమనేనిపై సీఎం సీరియస్‌

x
Highlights

దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై సీఎం చంద్రబాబు మరోసారి సీరియస్‌ అయ్యారు. విజయవాడ హనుమాన్‌ జంక్షన్‌లో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ పట్ల చింతమనేని...

దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై సీఎం చంద్రబాబు మరోసారి సీరియస్‌ అయ్యారు. విజయవాడ హనుమాన్‌ జంక్షన్‌లో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ పట్ల చింతమనేని వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా ప్రవర్తన వల్ల ప్రజల్లో పార్టీకి చెడ్డపేరు వస్తుందని మండిపడ్డారు. ఇవాళ తనను కలిసి ఘటనపై వివరణ ఇవ్వాలని చింతమనేని ఆదేశించారు.

ఆర్టీసీ బస్సుపై ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రకటనలో సీఎం ఫొటో చిరిగి ఉండటాన్ని గమనించిన చింతమనేని... ఆ బస్సుని అక్కడే నిలిపివేసి, డ్రైవర్‌, కండక్టర్లను దుర్భాషలాడారు. బస్సులో ప్రయాణికుల్ని దించేసి వేరే బస్సులోకి ఎక్కించాలని ఆదేశించారు. గరికపాటి నాగేశ్వరరావు అనే స్థానికుడు ప్రశ్నించే ప్రయత్నం చేయగా, ఆయనపై చేయి చేసుకున్నారు. మంగళవారం జరిగిన ఈ సంఘటన సందర్భంగా.. చింతమనేని ప్రవర్తించిన తీరుపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories