నేను నిప్పులా బతికాను : చంద్రబాబు

నేను నిప్పులా బతికాను : చంద్రబాబు
x
Highlights

తాను ఎవరిపైనా ఆధారపడలేదని.. నిప్పులా బతికానన్నారు సీఎం చంద్రబాబు. ఇందిరా గాంధి దగ్గర నుంచి వైఎస్ వరకు తనను ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేసి.. ఏమి...

తాను ఎవరిపైనా ఆధారపడలేదని.. నిప్పులా బతికానన్నారు సీఎం చంద్రబాబు. ఇందిరా గాంధి దగ్గర నుంచి వైఎస్ వరకు తనను ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేసి.. ఏమి చేయలేకపోయారని చెప్పారు. తన రాజకీయ జీవితంలో ఎక్కడ తప్పు చేయలేదన్నారు. ప్రతివారం కోర్టుకు హాజరయ్యే జగన్.. కోర్టు బయటకు వచ్చి తనపై ఆరోపణలు చేయడం హస్యస్పదంగా ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో నిర్వహించిన పంచాయతీరాజ్‌ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, పంచాయతీరాజ్‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్‌ సమీపంలో కొత్తగా నిర్మించిన పై వంతెనను‌ సీఎం ప్రారంభించారు. అక్కడ నుంచి మహాత్మాగాంధీ హోల్‌సేల్‌ వస్త్రదుకాణం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు చేరుకున్నారు. పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ సందర్శించిన అనంతరం ‘చంద్రక్రాంతి’ పథకాన్ని ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories