తాడిపత్రి ఘటనపై ఏపీ సీఎం సమీక్ష...నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి...

తాడిపత్రి ఘటనపై ఏపీ సీఎం సమీక్ష...నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి...
x
Highlights

అనంతపురం జిల్లా తాడిపత్రి ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. వెలగపూడి సచివాలయంలో ఇంటెలిజెన్స్‌, హోంశాఖ అధికారులతో సమావేశమయిన ఆయన వివాదం ఎక్కడ...

అనంతపురం జిల్లా తాడిపత్రి ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. వెలగపూడి సచివాలయంలో ఇంటెలిజెన్స్‌, హోంశాఖ అధికారులతో సమావేశమయిన ఆయన వివాదం ఎక్కడ ప్రారంభమయ్యిందో తెలుసుకున్నారు. శాంతి భద్రతలు కల్పించడంలో జిల్లా అధికారులు ఘోరంగా విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు జల్లా నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార పార్టీలో ఉంటూ శాంతి భద్రతలకు విఘాతం కలిగే ఎలాగంటూ ఆయన ప్రశ్నించారు. శాంతి భద్రతల విషయంలో ఎవరిని ఉపేక్షించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

సీఎంతో సమావేశం సందర్భంగా ఎంపీ జేసీ వ్యవహారాన్ని అధికారులుప్రస్తావించారు. ఓ వైపు ఆశ్రమ నిర్వాహకులు, మరో వైపు అధికార పార్టీ నేతలు కావడం వల్లే సంయమనం పాటించాల్సి వచ్చిందంటూ వివరణ ఇచ్చారు. అధికారుల వివరణపై అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మరో వైపు జేసీ ఆందోళన నేపధ్యంలో పరిస్దితులు చేయి దాటకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. అక్టోపస్ బలగాలను రంగంలోకి దింపిన పోలీసులు పూర్వనంద ఆశ‌్రమాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆశ్రమంలోకి ప్రవేశించిన పోలీసులు గుర్తింపు కార్డుల ద్వారా స్ధానికులను గుర్తిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆశ్రమం నుంచి బయటకు పంపుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా బస్సులను రప్పించిన పోలీసులు బలవంతంగా ఆశ్రమాన్ని ఖాళీ చేయిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories