Top
logo

రైతు బీమా.... నా జీవితంలో నేను చేసిన గొప్పపని : సీఎం కేసీఆర్‌

రైతు బీమా.... నా జీవితంలో నేను చేసిన గొప్పపని : సీఎం కేసీఆర్‌
X
Highlights

రైతు బీమా పథకం... తన జీవితంలోనే గొప్పపని అని సీఎం కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ హెచ్ఐసీసీలో జరిగిన రైతు సమన్వయ...

రైతు బీమా పథకం... తన జీవితంలోనే గొప్పపని అని సీఎం కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ హెచ్ఐసీసీలో జరిగిన రైతు సమన్వయ కమిటీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ ... రైతు బీమా పథకానికి సంబంధించి ఎల్ఐసీ సంస్థతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రైతు మరణించిన పది రోజుల్లోనే బాధిత కుటుంబానికి ఐదు లక్షల బీమా అందుతుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

రైతుబంధు పథకం విజయవంతం కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని నిత్యమూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వవాన్ని విమర్శించే వాళ్లు మనుషులని మనం అనుకుంటామని, కానీ వారు మనుషులు కాదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నేతలను విమర్శిస్తూ.... కేసీఆర్‌ ఓ పిట్ట కథ చెప్పారు.

Next Story