Top
logo

ఎన్నికల్లో గెలుపుకు కేసిఆర్ వ్యూహాలు...ఎమ్మెల్యేలకు ఎంపీ సీట్లు.. ఎంపీలకు ఎమ్మెల్యే సీట్లు

ఎన్నికల్లో గెలుపుకు కేసిఆర్ వ్యూహాలు...ఎమ్మెల్యేలకు ఎంపీ సీట్లు.. ఎంపీలకు ఎమ్మెల్యే సీట్లు
X
Highlights

వచ్చే ఎన్నికలను ధీటుగా ఎదుర్కొనేందుకు కేసీఆర్ వ్యూహన్ని సిద్దం చేసారా? పనితీరు ఒక్కటే సరిపోదు అభ్యర్ధుల ఎంపిక...

వచ్చే ఎన్నికలను ధీటుగా ఎదుర్కొనేందుకు కేసీఆర్ వ్యూహన్ని సిద్దం చేసారా? పనితీరు ఒక్కటే సరిపోదు అభ్యర్ధుల ఎంపిక కూడా పక్కాగా ఉండాలని భావిస్తున్నారా? సమగ్ర కుటుంబ సర్వే సమాచారం ఆదారంగా అభ్యర్ధుల ఎంపికలో సోషల్ ఇంజనీరింగ్ కు ఆయన అధిక ప్రధాన్యత నిస్తున్నారా? నియోజకవర్గాల్లో కులాలు, వారి బలాల అధారంగా అభ్యర్ధులను గుర్తిస్తున్నారా?

వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు గులాబి బాస్ కేసీఆర్ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ పనితీరును మెరుగు పరుచుకోవడంతో పాటు సరికొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే రైతు బంధు అమలు చేస్తున్న టిఆరెస్ ప్రభుత్వం..తాజాగా రైతు బీమాను ప్రవేశపెట్టింది. ఆగస్టు15 నుంచి కంటి వెలుగు పథకం కింద ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయిస్తున్నారు. మిషన్ భగీరధ ద్వారా తాగు నీటిని ఇంటింటికి అందించాలని భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగు నీటిని వీలైనంత త్వరగా అందించాలని ఆదేశాలు జారి చేసారు. ఇలా సంక్షేమ పథకాలను అందచేయడం ద్వారా ప్రజలను తనకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్నారు.

అదే సమయంలో ప్రజా నాడిని తెలుసుకునేందుకు ప్రతి 3 నెలలకోసారి సర్వే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పరంగా ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నా సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరు పట్ల వ్యతిరేకత ఉండటం కేసీఆర్ ను చికాకు పెడుతోంది. అందుకే వ్యతిరేకత ఎక్కువగా ఉన్న సిట్టింగులను మార్చేందుకు సిద్దపడ్డారు. అందు కోసం సమగ్ర కుటుంబ సర్వే సమాచారాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ సమగ్ర సర్వేలో భాగంగా ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం కలిసింది. కులాల వారి సమాచారాన్ని సైతం సేకరించింది. అనుగుణంగా చేపట్టిన గొర్రెల పంపిణి, చేపల పంపిణి, ఎంబీసీ కార్పోరేషన్ ఏర్పాటు, ఎంబీసీ కులాల జాబితా వంటి కార్యక్రమాలు ప్రజలకు చేరువ అయ్యాయి. అందుకే అభ్యర్ధుల ఎంపిక కోసం సమగ్ర కుటుంబసర్వే సమాచారాన్ని కేసీఆర్ నిశితంగా అద్యయనం చేస్తున్నారు. సమగ్ర సర్వే సమాచారాన్ని బయటపెట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం మాత్రం గోప్యంగా ఉంచుతోంది. తద్వారా సమగ్ర సర్వే ప్రయోజనాలు మొత్తం తనకు దక్కేలా వ్యూహరచన చేసింది.

అభ్యర్ధులను మార్చితే ఏ సామాజిక వర్గం అక్కడ బలంగా ఉంది, ఏ కూలానికి టికెట్ ఇస్తే గెలిపించుకోవడం సునాయసమవుతుందన్న మొత్తం సమాచారాన్ని సమగ్ర కుటంబ సర్వే నుంచే సేకరిస్తోంది. ఆ సమాచారం ఆధారంగా సోషల్ ఇంజనీరింగ్ ప్రయోగాన్ని అభ్యర్ధుల ఎంపికలో అమలు చేస్తే సత్ఫలితాలు వస్తాయని గులాబి బాస్ భావిస్తున్నారు. అందులో భాగంగా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేల నియోజకవర్గాలు మారే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న జీతేందర్ రెడ్డిని చేవెళ్లకు, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డిని మాల్కాజిగిరికి పంపే ఛాన్స్ ఉందంటున్నారు. భువన గిరి ఎంపీని అసెంబ్లీకి పోటి చేయించి, అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ను మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేయిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక మహబూబర్ నగర్ అసెంబ్లీని ముదిరాజ్ సామాజిక వర్గానికి కట్టబెట్టాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. ఇదే రీతిలో చాలా మంది సిట్టింగ్ లకు టికెట్లు దక్కకపోవచ్చు చాలా మందికి స్థాన చలనం తప్పకపోవచ్చంటున్నారు. కొత్త అభ్యర్ధుల గెలుపు అవకాశాలను తెలుసుకునేందుకు సర్వేలు నిర్వహిస్తున్నారు కేసీఆర్. 2014 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ తో గెలిచినప్పటికీ ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ జరిగితే తప్ప టీఆర్ఎస్ గెలిచే చాన్స్ లేదు. అందుకే సర్వేలు తప్పడం లేదంటున్నారు గులాబి నేతలు.

Next Story