రాహుల్ కామెంట్స్ కు కేసీఆర్ కౌంటర్...మా కుటుంబ పాలన మంచిదే

x
Highlights

రాహుల్ తెలంగాణ టూర్ సందర్భంగా ఫ్యామిలీ పాలిటిక్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందంటూ రాహుల్ చేసిన కామెంట్స్ పై సీఎం కేసీఆర్...

రాహుల్ తెలంగాణ టూర్ సందర్భంగా ఫ్యామిలీ పాలిటిక్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందంటూ రాహుల్ చేసిన కామెంట్స్ పై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ కుటుంబ పాలనతో పోల్చితే, తమ పాలన బెటర్ అన్నారు. కుటుంబపాలన అంశం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఆరోపణలు చేసే క్రమంలో తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీ పాలన సాగుతోందని ఆరోపించారు.

రాహుల్ కామెంట్స్ కు కేసీఆర్ ధీటుగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందన్న రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం కేసీఆర్ గాంధీ కుటుంబ పాలన కన్నా కేసీఆర్ కుటుంబ పాలన పెద్దదేమీ కాదన్నారు. గాంధీ ప్యామిలీ కన్నా తమ పాలన చాలా బెటర్ అని చెప్పారు. ఢిల్లీకి బానిసనలుగా ఉండటానికి తెలంగాణవాసులు సిద్ధంగా లేరని కేసీఆర్ తెలిపారు.

మన దేశంలో జాతీయ రాజకీయాలతో పాటు పలు రాష్ట్రాల్లోనూ కుటుంబ పాలన కొనసాగుతోంది. అయితే, ఎన్నికల ర్యాలీలలోనూ, బహిరంగ సభల్లోనూ ఫ్యామిలీ పాలన అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రత్యర్థులను ఇరకాటంలోకి నెట్టడం చాలా సందర్భాల్లో జరుగుతుంది. అయితే, నెహురు నుంచి రాహుల్ వరకు జాతీయస్థాయిలో కాంగ్రెస్ లో కుటుంబ పాలన సాగుతున్నప్పుడు కేసీఆర్ పై విమర్శలు ఎలా చేస్తారని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతీయ పార్టీలతో పాటు చాలా రాష్ట్రాల్లోనూ ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు పాలనలో భాగస్వాములుగా ఉన్నారని తమ అధినేతకు మద్దతుగా స్వరం వినిపిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories