గుండు హనుమంతరావు మృతిపట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

గుండు హనుమంతరావు మృతిపట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
x
Highlights

ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హన్మంతరావును కాపాడడానికి...

ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హన్మంతరావును కాపాడడానికి వైద్యులు, బంధుమిత్రులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం బాధాకరమని సీఎం అన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. సినీ, టీవీ రంగస్థలాల్లో తన నటన ద్వారా ఎందరో అభిమానులను సంపాదించుకున్న హన్మంతరావు మరణం తీరని లోటు అని సీఎం పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories