సీఎం చివాట్లు పెట్టిన తరువాతైనా వారిలో మార్పు వచ్చిందా..?

సీఎం చివాట్లు పెట్టిన తరువాతైనా వారిలో మార్పు వచ్చిందా..?
x
Highlights

విజయవాడ కనకదుర్గ దేవస్థానం ఈవో, పాలకమండలి సభ్యులకు విభేదాలు సమసి పోయాయా..? సీఎం చివాట్లు పెట్టిన తరువాతైనా వారిలో మార్పు వచ్చిందా..? తాజాగా దుర్గగుడి...

విజయవాడ కనకదుర్గ దేవస్థానం ఈవో, పాలకమండలి సభ్యులకు విభేదాలు సమసి పోయాయా..? సీఎం చివాట్లు పెట్టిన తరువాతైనా వారిలో మార్పు వచ్చిందా..? తాజాగా దుర్గగుడి పాలకమండలి చైర్మన్‌కి, సభ్యులకు మధ్య విభేదాలు తలెత్తాయా..?

ఈవో కోటేశ్వరమ్మకు పాలకమండలి చైర్మన్ గౌరంగబాబుకు మధ్య ఆధిపత్య పోరుతో ఇంద్రకీలాద్రి కొంతకాలంగా నలిగిపోతోంది. గత సంవత్సరం దసరా ఉత్సవాల మెమొంటోల కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఈవో కోటేశ్వరమ్మ దృష్టికి రావడం అవకతవకలు నిజమేనని తేలడం అక్రమాలకు పాల్పడిన ఏఈవో అచ్యుతరావుతో పాటు మరో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయడం చకచకా జరిగిపోయాయి. అయితే తమను సంప్రదించకుండా ఉద్యోగులను ఈవో సస్పెండ్ చేయడం ఏమిటని పాలకమండలి చైర్మన్ నిలదీయడంతో కోటేశ్వరమ్మకు గౌరంగబాబుకు మధ్య విభేదాలు మొదలయ్యాయి.

నలుగురు ఉద్యోగులపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలంటూ ఈవో కొటేశ్వరమ్మపై ఒత్తిడి తీసుకువచ్చి గౌరంగబాబు విజయం సాధించారు. ఈ వివాదంలో చివరికి సీఎం జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు హెచ్చరింకలు జారీ చేయడంతో గొడవ సద్దుమణిగినట్లే కనిపించింది. కానీ మెమెంటోల కొనుగోలు విషయంలో తలెత్తిన రగడ ఇంకా రాజుకుంటూనే ఉందని అంటున్నారు. తాజాగా పాలకమండలి చైర్మన్ గౌరంగ బాబుకి పాలకమండలి సభ్యులకు మధ్య సైతం విభేదాలు తలెత్తినట్లు సమాచారం. తమను సంప్రదించకుండానే సొంత నిర్ణయాలు తీసుటుంటున్నారని పాలకమండలి సభ్యులు చైర్మన్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తంగా ఉన్నారని తెలుస్తోంది. సీఎం జోక్యంతో నైనా కనకదుర్గ దేవస్థానం పాలకమండలిలో మార్పు వస్తుందనేకుంటే అందుకు భిన్నంగా వివాదాలు మరింత మదురుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. దుర్గగుడి పాలకమండలికి ఇప్పటికే సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రుబాబు తాజా విభేదాలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories