పులివెందుల సభలో సీఎం, ఎంపీ వాగ్వాదం

పులివెందుల సభలో సీఎం, ఎంపీ వాగ్వాదం
x
Highlights

పులివెందుల జన్మభూమి, మావూరు సభ వేదికపై సీఎం చంద్రబాబు, ఎంపీ అవినాశ్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వేదికపైనే ఎంపీ అవినాశ్‌రెడ్డి సీఎం...

పులివెందుల జన్మభూమి, మావూరు సభ వేదికపై సీఎం చంద్రబాబు, ఎంపీ అవినాశ్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వేదికపైనే ఎంపీ అవినాశ్‌రెడ్డి సీఎం చంద్రబాబును విమర్శించే ప్రయత్నం చేశారు. పులివెందులకు నీళ్లు వచ్చిన అంశంపై ఎంపీ అవినాశ్‌ వాదనకు దిగారు. గండిగోట, చిత్రావతి ఎత్తిపోతల పథకాన్ని వైఎస్‌ హయంలోనే 85 శాతం పూర్తీ చేశారని ఎంపీ అవినాశ్‌ చెప్పబోయారు. సరిగ్గా ఇక్కడే అవినాశ్‌ మైక్‌ కట్‌ అయింది. అయితే ఇది రాజకీయ వేదిక కాదని, జన్మభూమి, మా వూరు సభ అభివృద్ధికి చెందిందన్నారు సీఎం చంద్రబాబు. దీంతో ఆవేశంగా ఎంపీ అవినాశ్‌ సభా వేదిక పై నుంచి వెళ్లిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories