బీజేపీ మంత్రులపై సీఎం చంద్రబాబు ప్రశంసలు

బీజేపీ మంత్రులపై సీఎం చంద్రబాబు ప్రశంసలు
x
Highlights

మంత్రి పదవులకు రాజీనామా చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావులపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. బాగా పని...

మంత్రి పదవులకు రాజీనామా చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావులపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. బాగా పని చేశారని సీఎం చంద్రబాబు నాయుడు కితాబిచ్చారు. మంత్రులు సమర్థవంతంగా పని చేసిన కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావులను చంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందించారు. దేవదాయ, ధర్మదాయ శాఖలో మాణిక్యాలరావు, వైద్య, ఆరోగ్య శాఖలో కామినేని శ్రీనివాస్‌లు ఎన్నో మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రిగా పనిచేసిన మాణిక్యాలరావు.. కృష్ణా, గోదావరి పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించారని, దేవాలయాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి దేవదాయ శాఖ ఆదాయం పెరిగేలా కృషి చేశారని చంద్రబాబు కొనియాడారు. కామినేని శ్రీనివాస్ ఆరోగ్యశాఖలో కీలకమైన మార్పులు తీసుకొచ్చారని చెబుతూ ఒక ముఖ్యమంత్రిగా వారిని అభినందిస్తున్నానని చంద్రబాబు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories