మా అత్తగారిలా ఎవరూ ఇబ్బందులు పడకూడదనే

మా అత్తగారిలా ఎవరూ ఇబ్బందులు పడకూడదనే
x
Highlights

ప్రపంచానికి మెడికల్ హబ్‌గా అమరావతి తయారవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో మెడికల్ టూరిజాన్ని అభివృద్ది చేస్తామన్న చంద్రబాబు...

ప్రపంచానికి మెడికల్ హబ్‌గా అమరావతి తయారవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో మెడికల్ టూరిజాన్ని అభివృద్ది చేస్తామన్న చంద్రబాబు రానున్న కాలంలో 14 మెడికల్ కాలేజీలు, 14 ఆసుపత్రులు అమరావతికి వస్తాయన్నారు. గుంటూరులోని ఆటోనగర్‌లో ఒమెగా కేన్సర్‌ ఆసుపత్రిని సీఎం చంద్రబాబు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులు ప్రారంభించారు. అత్యాధునిక సదుపాయాలతో గుంటూరులో కేన్సర్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మా అత్తగారు (ఎన్టీఆర్ సతీమణి) క్యాన్సర్ వ్యాధితో చాలా ఇబ్బందులు పడ్డారు. అలా ఎవరు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో అప్పట్లో ఎన్టీఆర్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు’’ అని గుర్తు చేశారు. దేశంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories