ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌పై చంద్రబాబు ఆగ్రహం..

X
Highlights
గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఏపీలో టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్దానికి తెరతీసింది. గుజరాత్ ఎన్నికల ఫలితాల తర్వాత...
arun19 Dec 2017 6:38 AM GMT
గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఏపీలో టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్దానికి తెరతీసింది. గుజరాత్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. అయితే సోము వీర్రాజుపై రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సోము వీర్రాజు వ్యాఖ్యలను వారి విచక్షణకే వదిలివేయాలని, పార్టీ అనుమతి లేకుండా బీజేపీ నేతలపై ఎవరూ స్పందించవద్దని టీడీపీ నేతలకు చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు. కాగా... భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని రాజేంద్రప్రసాద్‌కు చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు.
Next Story