బీజేపీకి దొడ్డిదారిన మేలు చేయడమే ఆ కూటమి ఉద్దేశం: చంద్రబాబు

x
Highlights

దేశంలో మూడో కూటమికి ఉనికే లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. బీజేపీకి దొడ్డిదారిన మేలు చేయడమే ఆ కూటమి ఉద్దేశమన్నారు. అమరావతిలో పార్టీ నేతలతో...

దేశంలో మూడో కూటమికి ఉనికే లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. బీజేపీకి దొడ్డిదారిన మేలు చేయడమే ఆ కూటమి ఉద్దేశమన్నారు. అమరావతిలో పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. ఐదేళ్లలో ఏపీలో జరిగిన అభివృద్ధి ఎక్కడా జరగలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మేడ్చల్ సభలో సోనియాగాంధీ చెప్పడాన్ని సాకుగా చూపించి కేసీఆర్ ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టారన్నారు. టీఆర్ఎస్ ముందు హోదాకు అంగీకరించిందని, ఆ తర్వాత అడ్డం తిరిగిందని చెప్పారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ గెలిస్తే ఏపీలో వైసీపీ సంబరాలు చేసుకుందని ఆయన విమర్శించారు. వీళ్లకు స్వప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు. ఏపీని దెబ్బతీయాలనే ధోరణి దుర్మార్గమని మండిపడ్డారు సీఎం చంద్రబాబు.

Show Full Article
Print Article
Next Story
More Stories