విభజన హామీల సాధనలో రాజీ పడే ప్రసక్తే లేదు : చంద్రబాబు

విభజన హామీల సాధనలో రాజీ పడే ప్రసక్తే లేదు : చంద్రబాబు
x
Highlights

విభజన హామీల సాధనలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. విభజన సమయంలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తే...ఇప్పడు బీజేపీ...

విభజన హామీల సాధనలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. విభజన సమయంలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తే...ఇప్పడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఏపీకి పూర్తిగా సహకరించడం లేదని అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కాకానిలో జేఎన్టీయూ భవనాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్న చంద్రబాబు..విభజన హామీలను అమలు చెయ్యాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమని చంద్రబాబు అన్నారు.

తెలుగు జాతికి కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని చంద్రబాబు ప్రకటించారు. అన్యాయం జరిగేతే ఊరుకోబోమని స్పష్టంచేశారు. ఏపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో రాజకీయ కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం యత్నించడం సరికాదని చంద్రబాబు హితవు పలికారు. కేంద్రం, రాష్ట్రం కలసి పని చేస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఖర్చుల వివరాలు చెప్పాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని.. అది సరి కాదని ముఖ్యమంత్రి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories