పవన్‌, జగన్‌, కేసీఆర్‌ను ఎగదోస్తున్నారు: చంద్రబాబు

పవన్‌, జగన్‌, కేసీఆర్‌ను ఎగదోస్తున్నారు: చంద్రబాబు
x
Highlights

కేసీఆర్ వ్యాఖ్యలకు భయపడనన్నారు సీఎం చంద్రబాబునాయుడు. తెలంగాణలో ప్రచారం చేస్తే ఏదో గిఫ్ట్ ఇస్తామంటున్నారన్నారు. కేసీఆర్, జగన్, పవన్ కల్యాణ్ లను మోడి ...

కేసీఆర్ వ్యాఖ్యలకు భయపడనన్నారు సీఎం చంద్రబాబునాయుడు. తెలంగాణలో ప్రచారం చేస్తే ఏదో గిఫ్ట్ ఇస్తామంటున్నారన్నారు. కేసీఆర్, జగన్, పవన్ కల్యాణ్ లను మోడి ఎగదోస్తున్నారని ధ్వజమెత్తారు. దేశ రాజకీయాల్లో టీడీపీ తీసుకువచ్చిన కదలిక వల్లే బిజెపి మూడు రాష్ట్రాల్లో ఓడిపోయిందని ఎద్దేవా చేశారు చంద్రబాబు. రాబోయే ఎన్నికల్లో 25 పార్లమెంట్ స్థానాల్లో గెలిచి మోడిని ఇంటికి పంపాలని కోరారు. విశాఖ జిల్లా తగరపువలసలో జరిగిన ఆత్మీయ సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. ప్రత్యర్థులపై దాడులకు ఉపయోగిస్తున్నారని విమర్శించారు. దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని, అందుకే అన్ని రాజకీయపార్టీలతో బీజేపీ వ్యతిరేక కూటమికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories