నాకూ పైలట్‌ కావాలనుంది: చంద్రబాబు

నాకూ పైలట్‌ కావాలనుంది: చంద్రబాబు
x
Highlights

విభిన్నమైన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆనంద సూచీలో అగ్రస్థానంలో నిలిపామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వేదికగా...

విభిన్నమైన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆనంద సూచీలో అగ్రస్థానంలో నిలిపామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వేదికగా నిర్వహించిన విమాన విన్యాసాలు తిలకించిన అనంతరం మాట్లాడిన సీఎం విమాన విన్యాసాల్లో అంతర్జాతీయంగా పేరున్న గ్లోబల్ స్టార్ సంస్థ ఇక్కడ ప్రదర్శన ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇటీవలే సోషల్ మీడియా సమ్మిట్, ఎఫ్ 1 బోట్ రేసింగ్ విజయవాడలో నిర్వహించామని వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. బోట్ రేసింగ్ పోటీలకు ఇంతటి అనువైన ప్రాంతం ప్రపంచంలో ఎక్కడా లేదని సీఎం అభిప్రాయపడ్డారు. అమరావతిలో ప్రజలకు నిత్యం వినోదం, ఆహ్లాదం పంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం చూస్తుంటే తనకూ పైలట్‌ కావాలన్న కోరిక కలుగుతోందని సరదాగా వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories