ధర్మాబాద్ కోర్టుకు హాజరవడంపై చంద్రబాబు మంతనాలు..

x
Highlights

నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ వ్యవహారంలో చంద్రబాబు మంతనాలు జరుపుతున్నారు. ధర్మాబాద్ కోర్టుకు హాజరవ్వాలా వద్దా అనే అంశంపై అధికారులు, కీలక నేతలతో చర్చలు...

నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ వ్యవహారంలో చంద్రబాబు మంతనాలు జరుపుతున్నారు. ధర్మాబాద్ కోర్టుకు హాజరవ్వాలా వద్దా అనే అంశంపై అధికారులు, కీలక నేతలతో చర్చలు సాగిస్తున్నారు. నేడు మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

ధర్మా బాద్ కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ గురించి చర్చించడానికి సీఎం చంద్రబాబు మంత్రులు, టీడీపీ ముఖ్య నేతలు, అధికారులతో భేటీ అయ్యారు. 2010లో బాబ్లీ ప్రాజెక్టు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో జారీ అయిన వారెంట్ల అంశంపై మంతనాలు సమాలోచనలు జరిపారు. గతంలో ధర్మాబాద్ కోర్టు నుంచి నోటీసులు, వారెంట్లు ఏమైనా వచ్చాయా...? అని అధికారులను చంద్రబాబు ఆరా తీయగా ఇప్పటి వరకు ఎటువంటి నోటీసులు, వారెంట్లు జారీ కాలేదని వారు వివరించారు. తాజాగా జారీ అయిన అరెస్ట్ వారెంట్ అందినట్టుగా చంద్రబాబుకు సమాచారం ఇచ్చారు. న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టుకు వెళ్దామని చంద్రబాబు అన్నారు. అయితే ప్రత్యామ్నాయాలు పరిశీలించాక నిర్ణయం తీసుకోవాలని పలువురు నేతలు ఆయనకు సూచించినట్టు సమాచారం. రీకాల్‌ పిటిషన్‌ వేస్తే కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చని కొందరు నేతలు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ఒకవేళ చంద్రబాబు కోర్టుకు హాజరైతే ఆయన వెంట తెలంగాణ రైతులూ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని టీటీడీపీ నేతలు సీఎంతో అన్నారు.

ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్లపై చంద్రబాబు అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. అరెస్టు వారెంట్ల విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు ప్రజల సానుభూతి సంపాదించాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. మరోవైపు చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ టీటీడీపీ నేతలు..గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. మహారాష్ట్ర గవర్నర్‌తో కానీ...కేంద్రంతో కానీ మాట్లాడి వారెంట్ల గురించి మాట్లాడాలని కోరారు. చంద్రబాబుకు వారెంట్ల వెనుక బీజేపీ, టీఆర్‌ఎస్ కుట్ర ఉందన్న తెలంగాణ టీడీపీ నేతలు తమ విన్నసం పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories