తెలంగాణ అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌ను ఓడించాలి...

తెలంగాణ అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌ను ఓడించాలి...
x
Highlights

తెలంగాణ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ను ఓడించి ప్రజా కూటమిని గెలిపించాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ వైసీపీ, జనసేన కుమ్మక్కయ్యాని...

తెలంగాణ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ను ఓడించి ప్రజా కూటమిని గెలిపించాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ వైసీపీ, జనసేన కుమ్మక్కయ్యాని ఆరోపించారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తొలి దశ పనులకు గుంటూరు జిల్లా నకరికల్లు వద్ద ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఔటర్‌ రింగ్‌రోడ్డు, హైటెక్ సిటీ చూస్తుంటే తనకెంతో తృప్తి కలుగుతుందన్నారు. తెలుగుజాతి కలిసుండాలని అంటే కేసీఆర్‌ విమర్శిస్తున్నారని, కేసీఆర్‌ తనను తిడుతుంటే బాధేసిందని చంద్రబాబు అన్నారు. తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలని, మనం సహకరించాలని ఆయన అన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌, బీజేపీకి వైసీపీ పరోక్ష మద్దతు ఇస్తోందని చంద్రబాబు ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు జగన్, వపన్ లు పరోక్షంగా మద్దతిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories