సిఎం చంద్రబాబుగారు పిలుపునిచ్చారు

సిఎం చంద్రబాబుగారు పిలుపునిచ్చారు
x
Highlights

ప్రాజెక్టుల్లోకి భారీగా వచ్చిచేరెను వరద నీరు, ఇలాంటి సమయంలో అప్రమతమ్మే సరైన తీరు, అందుకనే సిఎం చంద్రబాబుగారు పిలుపునిచ్చారు, అధికారులు కూడా ప్రజలను...

ప్రాజెక్టుల్లోకి భారీగా వచ్చిచేరెను వరద నీరు,

ఇలాంటి సమయంలో అప్రమతమ్మే సరైన తీరు,

అందుకనే సిఎం చంద్రబాబుగారు పిలుపునిచ్చారు,

అధికారులు కూడా ప్రజలను అప్రమప్తం చేయాలనే సారు. శ్రీ.కో

భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అధికారులు కూడా ప్రజలను అప్రమప్తం చేయాలని ఆయన ఆదేశించారు.
రాష్ట్రంలో భారీవర్షాల నేపథ్యంలో వరద పరిస్థితిపై జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సిఎం చంద్రబాబు సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి తగిన సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. విపత్తు నివారణ, అగ్నిమాపక దళాలను సిద్ధంగా ఉంచాలని, వారితో రెవెన్యూ, పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సిఎం చెప్పారు. అలాగే సహాయక చర్యల్లో స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. వర్షాలు పడుతున్న జిల్లాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని వైద్యఆరోగ్య శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కూలిపోయి, కొట్టుకుపోయిన వంతెనల స్థానంలో ప్రత్యామ్నాయం, పునర్నిర్మాణం చేయాలన్నారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని, ప్రాజెక్టుల్లో వరదని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉండాల్సిందిగా అధికారులకు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories