టీడీపీ, బీజేపీ నేతల మధ్య ఘర్షణ

టీడీపీ, బీజేపీ నేతల మధ్య ఘర్షణ
x
Highlights

ఇన్నాళ్లూ మాటలతో సరిపెట్టుకున్న టీడీపీ, బీజేపీ నేతలు ఇక చేతలకు పని పెట్టేశారు. రోడ్డెక్కి తిట్టుకోవడం, కొట్టుకోవడం దాకా వెళ్ళిపోయింది యవ్వారం. ఏపీ...

ఇన్నాళ్లూ మాటలతో సరిపెట్టుకున్న టీడీపీ, బీజేపీ నేతలు ఇక చేతలకు పని పెట్టేశారు. రోడ్డెక్కి తిట్టుకోవడం, కొట్టుకోవడం దాకా వెళ్ళిపోయింది యవ్వారం. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బస చేసిన అనంతపురంలోని ఆర్‌అండ్‌బి గెస్ట్‌‌‌హౌస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గురువారం గెస్ట్‌హౌస్‌లో కన్నా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు గెస్ట్‌హౌస్ చేరుకుని కన్నా, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోనికి దూసుకొస్తున్న టీడీపీ కార్యకర్తలను బీజేపీ నేతలు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో సీఎం డౌన్‌ డౌన్ అంటూ టీడీపీ కండువాలకు బీజేపీ నేతలు నిప్పుపెట్టారు. పెద్ద ఎత్తున పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితి అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories