ఏపీలో కూడా ఇదే సీన్ రిపీట్ : సినీ రచయిత

nanireddy
Updated on: 24 Dec 2018 4:33 PM IST
ఏపీలో కూడా ఇదే సీన్ రిపీట్ : సినీ రచయిత
X

నిన్న(మంగళవారం) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘనవిజయం సాధించటంపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. వారిలో సినీ నటుడు మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.. 'ఎన్నికలకు ముందు ఫిలిం నగర్ దైవసన్నిధానం ప్రాగణంలో కే సి ఆర్ గారు గెలవాలని కోరు కుంటున్నాను అన్నాను. తధాస్తు దేవతలు తధాస్తు అన్నారు. ప్రజలు అద్భుతమైన అనితరసాధ్యమైన విజయాన్ని అందించారు. కేసిఆర్ గారూ సంభవం ఇది మీకే సంభవం! మీ విజయ పరంపర ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ' అని పేర్కొన్నారు.

అలాగే టీఆరెస్ విజయం సాధించాం పట్ల మంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు హీరో మహేష్ బాబు.. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిచిన పార్టీని అభినందిస్తూ ఓ వీడియో ద్వారా అభినందించాడు.. ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ కూడా ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఓ వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు.'తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు గారు టీఆర్‌ఎస్‌ పార్టీ సౌండ్‌ మాత్రమే విన్నారు.. 2019లో జరగబోయే ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే జనరల్‌ ఎలక్షన్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వినిపించబోయే రీ సౌండ్‌ వినబోతున్నారు. కేవలం రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం వినపడే రీ సౌండ్‌ వినబోతున్నారు' అని ఆ వీడియో సారాంశం.

nanireddy

nanireddy

Next Story