అగ్రిగోల్డ్ కేసులో మరో ట్విస్ట్

x
Highlights

అగ్రిగోల్డ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్ ఆస్తుల జాబితాలో ప్రధానంగా ఉన్న హాయ్ ల్యాండ్ ఎండీ వెంకటేశ్వరరావు ను సీఐడీ పోలీసులు...

అగ్రిగోల్డ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్ ఆస్తుల జాబితాలో ప్రధానంగా ఉన్న హాయ్ ల్యాండ్ ఎండీ వెంకటేశ్వరరావు ను సీఐడీ పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియను కుట్రపూరితంగా అడ్డుకున్నాడంటూ ఆరోపించిన సీఐడీ అధికారులు అగ్రిగోల్డ్ ఛైర్మన్‌తో కలిసి కుట్రకు పాల్పడినట్టు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో 27 మంది అరెస్టయ్యారు. గత వారం హైకోర్టులో విచారణ సందర్భంగా అగ్రిగోల్డ్ యాజమాన్యానికి హాయ్‌ల్యాండ్‌తో ఎలాంటి సంబంధం లేదంటూ ఎండీ వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి ఇదే విషయాన్ని అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలంటూ న్యాయవాదిని ఆదేశించారు. దీంతో పాటు అగ్రిగోల్డ్ ఆస్తులను గుర్తించడంలో ఎందుకు విఫలమవుతున్నారంటూ సీఐడీని ప్రశ్నించారు. పరిస్దితి ఇలాగే కొనసాగితే తామే స్వయంగా సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తును పర్యవేక్షిస్తామంటూ హెచ్చరించింది. హైకోర్టు ఆగ్రహానికి గురైన సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ నేపధ్యంలో లభించిన ఆధారాలతో హాయ్‌ల్యాండ్ ఎండీని అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో ఏలూరు కోర్టులో వెంకటేశ్వరరావును హాజరుపర్చనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories