తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్‌ సందడి

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్‌ సందడి
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్‌ సందడి నెలకొంది. ఏపీ, తెలంగాణలో క్రిస్మస్‌ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. విద్యుత్‌ దీపాల అలంకరణతో చర్చిలన్నీ...

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్‌ సందడి నెలకొంది. ఏపీ, తెలంగాణలో క్రిస్మస్‌ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. విద్యుత్‌ దీపాల అలంకరణతో చర్చిలన్నీ దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. క్రైస్తవులు పెద్దఎత్తున చర్చిలకు తరలివచ్చి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు. అందరూ మేరీ క్రిస్మస్‌ అంటూ ఒకరికొకరు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్‌ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. చర్చిలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబై విద్యుత్‌ దీపాల కాంతుల్లో వెలిగిపోతున్నాయి. ప్రత్యేక అలంకరణతో చర్చిలన్నీ అత్యంత అందంగా కనిపిస్తున్నాయి. మిరుమిట్ల గొలిపే లైట్లు ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్‌తోపాటు తెలంగాణవ్యాప్తంగా క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌ గ్రాండ్‌గా జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచే క్రైస్తవులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.

క్రైస్తవులు అధికంగా ఉన్న సికింద్రాబాద్‌లో క్రిస్మస్‌ సంబరాలు అంబరాన్నంటాయి. క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌తో చర్చిల్లో సందడి నెలకొంది. క్లాక్‌టవర్‌ సెయింట్‌ మెరీస్‌ చర్చి విద్యుత్‌ దీపాల కాంతుల్లో వెలిగిపోతోంది. మిడ్‌నైట్‌ వరకూ జరిగిన ప్రత్యేక ప్రార్ధనల్లో వందలాది మంది క్రైస్తవులు పాల్గొన్నారు.

ఇక స్మార్ట్‌ సిటీ విశాఖలో క్రిస్మస్‌ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. సాగర తీరంలో క్రైస్తవ సోదరులు ఆకాశ దీపాలు వెలిగించి క్రిస్మస్‌ వేడుకలు జరుపుకున్నారు. ప్రతీ ఇల్లూ వెలుగులమయం కావాలని స్కైలాంతర్లు వెలిగించారు. క్రైస్తవులు వెలిగించిన రంగురంగుల స్కైలాంతర్లతో సాగర తీరం వెలుగులతో నిండిపోయింది. అందరూ మేరీ క్రిస్మస్‌ అంటూ ఒకరికొకరు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

అలాగే కడప జిల్లాలోనూ క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌ గ్రాండ్‌గా జరుగుతున్నాయి. విద్యుత్‌ దీపాల అలంకరణతో చర్చిలన్నీ దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. కడపలో ఏర్పాటుచేసిన బాలయేసు ప్రతిమ, క్రిస్మస్‌ ట్రీలు నగర వాసులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. కడప జిల్లాలోనే మొట్టమొదటిదైన కాంగ్రిగేషనల్‌ చర్చిలో యేసుక్రీస్తుతోపాటు మేరీమాత ఫ్లెక్సీలు, శాంటాక్లాజ్‌ బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. క్రిస్మస్‌ సందర్భంగా కేక్స్ కట్‌ చేసి సంబరాలు జరుపుకుంటున్నారు. వికారాబాద్‌ జిల్లాలోనూ క్రిస్మస్‌ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. క్రిస్మస్‌ సందర్భంగా క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు.

క్రిస్మస్‌ సందర్భంగా కేక్స్ కట్‌ చేసి క్రైస్తవులు సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రార్ధనా మందిరాలన్నీ ప్రత్యేక కార్యక్రమాలతో మార్మోగిపోతున్నాయి. మేరీ క్రిస్మస్‌ అంటూ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. అంతేకాదు అత్యంత సుందరంగా ముస్తాబైన చర్చిల ముందు సెల్ఫీలు దిగుతూ క్రైస్తవులు సందడి చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories