Top
logo

విషాదం..ఆడుకుంటున్న చిన్నారులకు అంటుకున్న నిప్పు

Highlights

కరీంనగర్‌ జిల్లాలో దారుణం జరిగింది. చొప్పదండి మండలం వెదురుగుట్టలో పొరపాటున ముగ్గురు చిన్నారులకు నిప్పు...

కరీంనగర్‌ జిల్లాలో దారుణం జరిగింది. చొప్పదండి మండలం వెదురుగుట్టలో పొరపాటున ముగ్గురు చిన్నారులకు నిప్పు అంటుకుంది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఐదేళ్ల చిన్నారులు అగ్గిపెట్టేతో ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ నిప్పు రవ్వలు పక్కనున్న కిరోసిన్‌పై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చేలరేగడంతో చిన్నారులు భయంతో అరుపులు కేకలు వేశారు.

అగ్ని కీలల మధ్య పిల్లల ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పేసి చిన్నారులను రక్షించారు. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంటడంతో కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో చలిమంటలు వేసుకునేందుకు ప్రయత్నించడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని స్ధానికులు భావిస్తున్నారు.


లైవ్ టీవి


Share it
Top